Andhra Pradesh: నగరిలో కొనసాగుతున్న రోజా జోరు.. 4,200 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి!

  • 145 నియోజకవర్గాల్లో ఫ్యాను జోరు
  • నగరిలో ముగిసిన రెండో రౌండ్
  • 29 స్థానాల్లో ఆధిక్యంలో టీడీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 145కుపైగా నియోజకవర్గాల్లో సత్తా చాటుతోంది. తాజాగా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా 4,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

మరోవైపు విజయనగరంలోని కురుపాంలో పాముల పుష్పవాణి లీడ్ లో ఉన్నారు. తాజా అప్ డేట్ ప్రకారం వైసీపీ 145 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, 29 స్థానాల్లో టీడీపీ అధిక్యంలో కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావమే లేకుండా పోయింది.
Andhra Pradesh
roja
YSRCP

More Telugu News