Andhra Pradesh: కుప్పంలో నాలుగు రౌండ్లు ముగిసేసరికి చంద్రబాబుకు 2 వేల ఓట్ల ఆధిక్యం!

  • కుప్పంలో చంద్రమౌళి హోరాహోరీ పోరు
  • మంగళగిరిలో నారా లోకేశ్ వెనుకంజ
  • 31 స్థానాలకే పరిమితమైన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి కుప్పంలో గట్టిపోటీ ఇస్తున్నారు. తొలి రౌండ్ లో టీడీపీ అధినేత వెనుకపడినట్లు వార్తలు వచ్చినప్పటికీ రెండో రౌండ్ ముగిసేసరికి చంద్రబాబు దూసుకుపోతున్నారు. తాజాగా కుప్పంలో నాలుగు రౌండ్లు ముగిశాక చంద్రబాబు 2,015 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి మంత్రి లోకేశ్ పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజాగా అందుతున్న అప్ డేట్స్ ప్రకారం ఏపీలో వైసీపీ 143 సీట్లలో, టీడీపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Andhra Pradesh
kuppam
YSRCP
Telugudesam
Chandrababu

More Telugu News