వెనుకంజలో మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా!
- అనూహ్య రీతిలో తీర్పు ఇస్తున్న ఏపీ ప్రజలు
- 145 సీట్లు సాధించే దిశగా వైసీపీ
- ఓటమి దిశగా సీనియర్ మంత్రులు
మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ పడిన నారా లోకేశ్, తొలి రౌండ్ లో స్వల్ప ఆధిక్యాన్ని చూపించినప్పటికీ, ఆపై వెనుకబడిపోయారు. ఇక్కడ మూడో రౌండ్ ముగిసేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూసుకొచ్చారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి మాయమైంది. ఈ ఉదయం పార్టీ కార్యాలయం వద్ద కనిపించిన కొద్దిమంది నేతలు, ఇప్పుడు వెనుదిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి.