పశ్చిమ బెంగాల్లో టీఎంసీ-బీజేపీ హోరాహోరీ
- బీజేపీ 14, టీఎంసీ 20 స్థానాల్లో ఆధిక్యం
- మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
- ఒక స్థానంలోనే ఇతరులు
ఇప్పటి వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గతంలో రెండు సీట్లు మాత్రమే కలిగిన బీజేపీ ఈసారి దూసుకెళ్తోంది. బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.