Election result: కర్ణాటకలో మూడు స్థానాల్లో బీజేపీ లీడ్.. యూపీలో కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీ

  • యూపీలో చెరో మూడు స్థానాల్లో ఆధిక్యం
  • మహాకూటమి రెండు స్థానాల్లో
  • కర్ణాటకలో ఓ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న లెక్కింపు సమయం వచ్చేసింది. ఈవీఎంలు తెరుచుకున్నాయి. లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు గాను మూడు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు చోట్ల బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మహాకూటమి రెండు స్థానాల్లో లీడ్‌లో ఉంది. మొత్తంగా ఎన్‌డీఏ 17, యూపీఏ 5, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Election result
Uttar Pradesh
Karnataka

More Telugu News