Elections: మొదలైన ఓట్ల లెక్కింపు, తెరచుకున్న పోస్టల్ బ్యాలెట్లు!

  • 42 రోజుల ఉత్కంఠకు తెర
  • మొదలైన కౌంటింగ్
  • దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సిబ్బంది 
  • 700కు పైగా కౌంటింగ్ కేంద్రాలు
42 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు తెరచుకున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది వేసిన పోస్టల్ ఓట్లను లెక్కించే పనిలో కౌంటింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. మరో ఆరగంట వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తికానుండగా, ఆ తరువాత ఈవీఎంలను అధికారులు తెరవనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 700కు పైగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. వీటన్నింటిలో దాదాపు 2 లక్షల మందికి పైగా సిబ్బంది ఓట్లను లెక్కించే పనిలో ఉన్నారు.
Elections
Counting
Andhra Pradesh
India

More Telugu News