ఆ మర్నాడే ‘పీఎం నరేంద్రమోదీ’ విడుదల చేస్తాం: వివేక్ ఒబెరాయ్

  • మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’
  • మోదీ తిరిగి అధికారంలోకి వచ్చిన మర్నాడే విడుదల
  • ఈ బయోపిక్ కోసం ప్రజలు ఆసక్తితో ఉన్నారు. 
ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘కోడ్’ అమలులో ఉన్న కారణంగా గత నెలలో విడుదల కావాల్సిన ఈ బయోపిక్ రిలీజ్ కాలేదు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఈ బయోపిక్ విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోదీ తిరిగి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈ చిత్రం అన్ని థియేటర్లలో విడుదల అవుతుందని చెప్పారు. ఈ బయోపిక్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఢిల్లీ, ముంబై లలో ‘పీఎం నరేంద్ర మోదీ’ ప్రీమియర్ షోలను ఇప్పటికే ప్రదర్శించినట్టు చెప్పారు. 
Go Back to Shorts
pm
modi
Bollywood
vivek obei roy
elections

More Telugu News