జమ్మూకశ్మీర్ లోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఘటన
- నిఘావర్గాల సమాచారంతో ఆపరేషన్
- భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
దీంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. కాగా, ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.