ఎన్నికల సందర్భంగా 909 సోషల్ మీడియా పోస్టులను తొలగించిన ఈసీ

  • రాజకీయ పరమైన పోస్టులు 482 
  • పార్టీల ప్రకటనలకు సంబంధించి 73 పోస్టులు 
  • గత ఎన్నికల్లో ఏకంగా 1,297 పోస్టులను తొలగించిన ఈసీ
సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఆదివారం చివరి విడత ముగిసే వరకు మొత్తం 909 సోషల్ మీడియా పోస్టులను తొలగించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే, పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 647 కేసులు నమోదు చేసినట్టు పేర్కొంది. సామాజిక మాధ్యమాల నుంచి తొలగించిన 909 పోస్టుల్లో 650 ఫేస్‌బుక్ పోస్టులు ఉన్నట్టు తెలిపింది. ఇందులో 482 పోస్టులు రాజకీయ పరమైనవని, 73 ఆయా పార్టీలకు చెందిన ప్రకటనలని, రెండూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించినవని తెలిపింది.

అలాగే, 220 ట్విట్టర్ పోస్టులు, 31 షేర్‌చాట్ పోస్టులు, వాట్సాప్‌లో మూడు, గూగుల్‌లో ఐదు పోస్టులను గుర్తించి తొలగించినట్టు తెలిపింది. కాగా, గత ఎన్నికల్లో ఏకంగా 1,297 పోస్టులను తొలగించినట్టు ఈసీ పేర్కొంది. 647 పెయిడ్ న్యూస్ కేసుల్లో 57 ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల సందర్భంగా గుర్తించినట్టు ఈసీ పేర్కొంది.
Go Back to Shorts
EC
Facebook
Twitter
Social Media
Paid news

More Telugu News