Tamil Nadu: ​ఎగ్జిట్ పోల్స్: తమిళనాట తిరుగులేని డీఎంకే!​.. క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న 'ఇండియాటుడే'!

షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు కూడా గణనీయమైన స్థాయిలో సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియాటుడే మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తమిళనాడులో డీఎంకే ఎదురులేని ప్రస్థానం కొనసాగించబోతోందని తెలిపారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 34 నుంచి 38 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియాటుడే అంచనా వేసింది. ఇక అధికార అన్నాడీఎంకే దారుణమైనరీతిలో సున్నా నుంచి 4 స్థానాల వరకే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం 38 లోక్ సభ స్థానాలు ఉండగా, డీఎంకే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇండియాటుడే సర్వే ద్వారా అర్థమవుతోంది.
Go Back to Shorts
Tamil Nadu

More Telugu News