modi: మోదీపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

  • మోదీ, అమిత్ షాలు ‘కోడ్’ ఉల్లంఘించారు
  • వీళ్లిద్దరిపై తక్షణమే చర్యలు చేపట్టాలి
  • ‘కోడ్’ అమలులో ఉండగానే మోదీ పర్యటనకు వెళ్లారు
కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈసీకి ఓ లేఖ రాశారు. మోదీ, అమిత్ షాలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు. వీళ్లిద్దరిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఈసీని కోరారు. ప్రచార గడువు ముగిసినా మోదీ, అమిత్ షా లు విలేకరుల సమావేశం నిర్వహించారని,
ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే కేదార్ నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలను మోదీ సందర్శించారని ఫిర్యాదు చేశారు. ఈ యాత్రలకు సంబంధించిన వీడియోలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని, తక్షణమే మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. 
modi
pm
Chandrababu
cm
ECE

More Telugu News