కప్ గెలిచేది ఆస్ట్రేలియానే... ఆ తర్వాతే భారత్, ఇంగ్లాండ్ జట్లకు అవకాశాలు: గంభీర్
- ఆసీస్ వద్ద సరైన ప్లాన్ ఉంది
- ఆసీస్ ఓ చాంపియన్ టీమ్
- భారత జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా రాణిస్తారు
ఇక సొంతగడ్డపై ఆడుతుండడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం అని పేర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ జట్టులో నలుగురు ఆల్ రౌండర్లు ఉండడం అదనపు బలంగా అభివర్ణించాడు. కప్ గెలిచే విషయంలో భారత జట్టును ద్వితీయ ప్రాధాన్యతా క్రమంలో చేర్చాడు. టీమిండియాలో కోహ్లీ, రోహిత్ శర్మ భారీ స్కోర్లు సాధిస్తారని, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కొరకరానికొయ్యలా పరిణమిస్తాడని గంభీర్ తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో జరగబోయే ఈ వరల్డ్ కప్ మే 30 నుంచి షురూ కానుంది.