Narendra Modi: కేదార్‌నాథ్‌ బాబా ఇప్పటికే ఎక్కువిచ్చారు...ఆయనను మరేమీ అడగలేదు : ప్రధాని మోదీ

  • రెండు రోజుల ఉత్తరాఖండ్‌ పర్యటనలో మోదీ
  • నిన్న కేదారినాథ్‌ను దర్శించుకుని అక్కడి గుహలో ధ్యానముద్ర
  • దేశమంతా తిరిగే శక్తి ప్రజలకు రావాలని ఆకాంక్ష
బాబా కేదారినాథ్‌ తనకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారని, అందుకే ఆయనను మరేమీ ఇవ్వాలని కోరలేదని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ జ్యోతిర్లంగ క్షేత్రమైన కేదారినాథ్‌ను దర్శించుకున్న అనంతరం అక్కడి పవిత్ర ధ్యాన గుహలో ధ్యానముద్రలో ఈ రోజు ఉదయం వరకు ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎక్కువే ఇచ్చాడని వ్యాఖ్యానించారు. కష్టించి పనిచేసే సభ్యుల బృందం దొరకడం ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలందరికీ యావత్‌ భారత దేశం సందర్శించే శక్తి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Narendra Modi
kedarinadh
dhyanam

More Telugu News