Bollywood: మనిద్దరి ప్రయాణం గొప్పగా సాగింది సునీతాకపూర్.. ఐలవ్ యూ!: అనిల్ కపూర్

  • నేడు అనిల్-సునీత వివాహ వార్షికోత్సవం
  • 35 ఏళ్లు పూర్తిచేసుకున్న జంట
  • ట్విట్టర్ లో భార్యకు శుభాకాంక్షలు తెలిపిన అనిల్ కపూర్
బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ 35 వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ నేపథ్యంలో భార్య సునీత కపూర్ పై అనిల్ ప్రశంసలు కురిపించారు. ‘నా జీవితంలో జరిగిన గొప్ప ఘటన ఏదైనా ఉందంటే అది నువ్వే. జీవితంలో మనిద్దరి ప్రయాణం సాహసోపేతంగా సాగింది. 11 ఏళ్ల డేటింగ్ తో పాటు వివాహమై 35 ఏళ్లు అప్పుడే పూర్తయిపోయాయి.

ఇంకో 46 సంవత్సరాల పాటు నీతో కలిసి జీవించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు సునీతాకపూర్.. ఐలవ్ యూ’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సునీతతో దిగిన ఫొటోను అనిల్ కపూర్ ట్వీట్ కు జతచేశారు.
Bollywood
anil kapoor
sunita kapoor
35 year anniversary

More Telugu News