బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు అందుకున్న మహేశ్ బాబు, మహర్షి టీమ్
మహర్షి చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్రబృందంలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. విశేష ప్రజాదరణ పొందడంతో పాటు బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతూ మహర్షి చిత్రం దూసుకెళుతుండడంతో ఈ సినిమా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. బెజవాడ సిద్ధార్థ కాలేజి గ్రౌండ్ మహర్షి విజయోత్సవ వేడుకలకు ఆతిథ్యమివ్వనుంది. హీరో మహేశ్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఇవాళ మధ్యాహ్నం విజయవాడ విచ్చేసిన మహేశ్ బాబు తదితరులు ముందుగా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలోకి ప్రవేశించిన మహర్షి టీమ్ కు ఆలయవర్గాలు సంప్రదాయరీతిలో స్వాగతం పలికాయి. పూజాదికాలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు మహేశ్ బాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు.