ఆ సినిమా కోసం గీతాంజలి నన్ను కొట్టింది .. ఆ తరువాత ఏడ్చింది!: సీనియర్ హీరోయిన్ జమున
- సావిత్రితో ఎక్కువ సాన్నిహిత్యం
- నేనంటే గీతాంజలికి ఎంతో ఇష్టం
- కలిసి కొన్ని సినిమాల్లో నటించాము
నేనంటే గీతాంజలికి చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. 'చల్లని నీడ' అనే సినిమాలో నేను హీరోయిన్ .. తనేమో క్రూరమైన మనస్తత్వం కలిగిన పొగరుబోతు పాత్రను పోషించింది. ఆ సినిమాలో నన్ను ఆమె కొట్టే సీన్ ఒకటి వుంది. ఎంత నటన అయినా నాలుగు దెబ్బలు కొడితే అందులో రెండు దెబ్బలైనా నిజంగానే తగులుతాయిగదా. అలా గీతాంజలి కొడుతుంటే నాకు నిజంగానే తగిలేవి. షాట్ పూర్తయిన తరువాత 'తగిలిందా అక్కయ్యా' అంటూ ఏడవడం మొదలుపెట్టేది" అంటూ నవ్వేశారు.