కౌంటింగ్‌కు అవాంతరాలు లేకుండా చూడండి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ నేతలు
- సీఈసీతో ఎంపీలు, ఇతర నాయకులు భేటీ
- ఆరోజు టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు
- సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ చేయాలని వినతి
కౌంటింగ్ రోజున అలజడులు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించే అవకాశం ఉందని, అందువల్ల అదనపు బలగాలను మోహరించాలని కోరారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని తెలియజేసింది. కౌంటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాని విజ్ఞప్తిచేశారు.