చంద్రగిరిలో రీ-పోలింగ్ అనగానే ఇంతలా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి
- ఈసీకి దాడికి పురమాయించేంత తప్పేం జరిగింది?
- ఓడిపోయినట్లు ఆ ఆందోళన ఎందుకు?
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘చంద్రగిరిలో 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ అంటేనే ఇంతగా వణికిపోతున్నారేంటి చంద్రబాబూ. ఈసీపై దాడికి పురమాయించేంత తప్పేం జరిగిందని? ఏ పార్టీ ఓటర్లు ఆ పార్టీకి ఓటేస్తారు. ఓడిపోయినట్లు గంగ వెర్రులెందుకు? పాతికేళ్ళుగా దళితులను ఓటు హక్కుకు దూరం చేసిన మీ నిజస్వరూపం బయటపడినందుకా?’ అని నిలదీశారు.