అమేథీలో నమాజ్.. ఉజ్జయినిలో పూజలు: ప్రియాంకపై స్మృతి ఇరానీ ఫైర్
- ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు
- రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు
- మంత్రదండం లేదని ఇప్పుడు చెబుతున్నారు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక మాట తప్పారని స్మృతి దుయ్యబట్టారు. తన వద్ద మంత్రదండం లేదని ఇప్పుడు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
అమేథీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గెలుపు కోసం ప్రియాంకగాంధీ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు.