‘పశ్చిమబెంగాల్ ఘటన’ చంద్రబాబుకు కనిపించడం లేదా?: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- బెంగాల్ లో ఓటర్లకు బదులు అధికారి బటన్ నొక్కారు
- ఈసీ మెతగ్గా ఉండి ఉంటే ఇక్కడా అదే జరిగేది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా? ఎలక్షన్ కమిషన్ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?’ అని మండిపడ్డారు.