Chittoor District: 19 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించొద్దు.. ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్

  • కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకేనన్న కలెక్టర్ ప్రద్యుమ్న
  • థియేటర్లు అన్నీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టీకరణ
  • ఉల్లంఘించి సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలంటూ హెచ్చరిక
ఈ నెల 19వ తేదీ వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించవద్దంటూ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేసి సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆర్‌వోలు, ఎస్పీలు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవో సహా 66 మంది తహసీల్దార్లకు ఆదేశాల నకళ్లను పంపారు. జిల్లాలోని థియేటర్లు అన్నీ ఈ ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న అందులో పేర్కొన్నారు.
Chittoor District
Lakshmi's ntr
Movie
Elections
Ramgopal varma

More Telugu News