Davuluri venkata rao: స్వాతంత్ర్య సమరయోధుడు దావులూరి కన్నుమూత

  • రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దావులూరి
  • స్వాతంత్ర్యానంతరం ఉపాధ్యాయుడిగా సేవలు
  • నేడు తిరుమలగిరిలోని స్వర్గవాటికలో అంత్యక్రియలు
రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఎం నేత దావులూరి వెంకటరావు (97) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌లోని జనాభ్యుదయ వయోధిక ఆశ్రమంలో ఉంటున్న ఆయన నిన్న మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తదిశ్వాస విడిచినట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని పచ్చలతాడిపర్రుకు చెందిన దావులూరికి భార్య కమలమ్మ (92) ఉన్నారు.

యుక్తవయసులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న దావులూరి రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం  ఉపాధ్యాయుడిగా పనిచేసి 1977లో రిటైరయ్యారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల పింఛనును కూడా ఆయన తిరస్కరించారు. ఈ ఉదయం 10 గంటలకు తిరుమలగిరిలోని స్వర్గవాటికలో దావులూరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Davuluri venkata rao
Hyderabad
Freedom fighter
Andhra Pradesh

More Telugu News