సింగర్ శ్రేయా ఘోషల్ వెంట వాయిద్య పరికరాన్ని అనుమతించని ఎయిర్ లైన్స్
- సింగపూర్ ఎయిలైన్స్ విమానంలో చేదు అనుభవం
- విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిన వైనం
- సారీ చెప్పి వివరాలు అడిగిన ఎయిర్ లైన్స్ సంస్థ
ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ పై ట్విట్టర్ ద్వారా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. విలువైన వాయిద్య పరికరాలు ఉంటే సింగపూర్ ఎయిలైన్స్ విమానంలోకి ఎక్కనివ్వదేమో అంటూ ఎద్దేవా చేసింది. తనకు గుణపాఠం నేర్పినందుకు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేసింది.
ఆమె ట్వీట్ కు సింగపూర్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని... తమ సిబ్బంది మీతో ఏమన్నారో వివరంగా చెప్పాలని కోరింది.