Telugudesam: ‘తెలుగు చిరంజీవుల సుఖీభవం’ పథకాన్ని గుర్తుచేసుకున్న టీడీపీ

  • నాడు ఎన్టీఆర్ హయాంలో వచ్చిన పథకం 
  • బడికెళ్ళే చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టారు
  • చిన్నారులతో కలిసి ఎన్టీఆర్ భోజనం చేస్తున్న ఫొటో పోస్ట్ చేసిన టీడీపీ
నాడు ఎన్టీఆర్ హయాంలో బడికెళ్ళే చిన్నారుల ఆరోగ్యం కోసం 'తెలుగు చిరంజీవుల సుఖీభవం' పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం గురించి తాజాగా టీడీపీ ప్రస్తావించింది. ఈ పథకం కింద 1 నుండి 5వ తరగతి చదువుతున్న పిల్లలకు ఆరోగ్య కార్డులు ఇచ్చి, ఆరునెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. అవసరమైన పిల్లలకు ఉచిత వైద్యచికిత్స అందించిన విషయాన్ని పార్టీ గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ లో చిన్నారులతో కలిసి ఎన్టీఆర్ భోజనం చేస్తున్న ఓ ఫొటోనూ జతపరిచింది.
Telugudesam
NTR
Telugu chiranjeevuli sukhi bhava

More Telugu News