Jammu And Kashmir: భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఘటన
  • ఒక జవాన్ మృతి..ఇద్దరికి గాయాలు
  • డాలిపొరా ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. డాలిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలిస్తుండగా వారు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం తరలించారు.
Jammu And Kashmir
pulwama
dollypora
teerorists

More Telugu News