కమలహాసన్ వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసుల కేసు నమోదు
- నాథూరాం గాడ్సేను ఉగ్రవాదిగా పేర్కొన్న నటుడు
- దీనిపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- ఈనెల 12న ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యలు చేసిన కమల్
తమిళనాడులోని అరవకురిచ్చిలో ఈనెల 12న జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమల్ మాట్లాడుతూ స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువని, అతను నాథూరాంగాడ్సే అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కమల్ వ్యాఖ్యలను బీజేపీ, అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించగా, డీఎంకే, కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన కమల్ పార్టీ ఎంఎన్ఎం గుర్తింపు రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదే విషయంపై ఢిల్లీ కోర్టులో కూడా కమల్ కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి.