హైకోర్టులో ముందస్తు బెయిల్ కు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ దరఖాస్తు... తిరస్కరించిన ధర్మాసనం!
- రవిప్రకాశ్ తరఫున న్యాయవాది పిటిషన్
- సంఘంలో పేరున్న వ్యక్తని వాదనలు
- పోలీసుల ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి సూచన
సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా ఆయన స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది.