Imran khan: అలా చేస్తేనే ఇమ్రాన్ ఖాన్ నిజంగా మోదీ అభిమాని అని నమ్ముతాం: రాజ్ నాథ్ సింగ్

  • ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ప్రకటించాలి
  • అవసరమైతే పాకిస్థాన్ కు సహాయం చేస్తాం
  • భారత్ తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారనే నమ్ముతున్నాం
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని పాకిస్థాన్ ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అలాంటి ప్రకటన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి వస్తే నిజంగానే ఆయన మోదీ అభిమాని అని నమ్ముతామని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అవసరమైతే పాకిస్థాన్ కు భారత్ సహాయం చేస్తుందని తెలిపారు. భారత్ తో పాకిస్థాన్ మంచి సంబంధాలను కోరుకుంటోందనే తాము భావిస్తున్నామని చెప్పారు.

మోదీ మరోసారి ప్రధాని అయితే... భారత్, పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉందని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో, 'ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు మోదీ' అంటూ విపక్ష నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో, రాజ్ నాథ్ సింగ్ పైమేరకు స్పందించారు.
Imran khan
modi
rajnath singh
pakistan
india

More Telugu News