KCR: కేసీఆర్‌ తన అసలు ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలి: టీడీపీ నాయకుడు లంక దినకర్‌

  • ఆయన ఎన్డీఏ పక్షాల వద్దకు ఎందుకు వెళ్లడం లేదు
  • బీజేపీ వ్యతిరేక పక్షాలనే ఎందుకు కలుస్తున్నారు
  • ఆయన వెంట జగన్‌ తప్ప ఎవరూ లేరు
కేసీఆర్‌ తాను కప్పుకున్న రాజకీయ ముసుగు తొలగించుకుని మనసులో ఉద్దేశం బయటపెట్టిన తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తిరిగితే బాగుంటుందని టీడీపీ నాయకుడు లంక దినకర్‌ కోరారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓ వైపు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు లక్ష్యమని చెబుతూ ఆయన బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలనే ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి గతం కంటే వంద సీట్లు తగ్గుతాయన్నది ఓ అంచనా అని, కేసీఆర్‌కు బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఉంటే ఎన్టీయేలోని పక్షాలను కలవాలి కదా? అని ప్రశ్నించారు. మహాకూటమి నేతలను కలిసేటప్పుడు ముందు ఆయన మోదీకి వ్యతిరేకమా? కాదా? అన్న విషయం స్పష్టం చేయాలని సూచించారు. ప్రస్తుతానికి కేసీఆర్‌ వెంట జగన్‌ తప్ప మరెవరూ లేరని, కేసీఆర్‌ ముసుగు త్వరలోనే తొలగిపోనుందని చెప్పారు.
KCR
Fedral front
Telugudesam
lanka dinakar

More Telugu News