Crime News: క్రికెట్‌ బెట్టింగ్‌లు నడుపుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్టు

  • కృష్ణా జిల్లా పోరంకిలో కార్యకలాపాలు
  • విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు
  • సెల్‌ ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, టీవీలు స్వాధీనం
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోరంకి గ్రామంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు నడుపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల దాదాపు యాభై రోజులపాటు దేశవ్యాప్తంగా సందడి రేపిన ఐపీఎల్‌-12 సీజన్‌లో వీరు చురుకుగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఆదివారం హైదరాబాద్‌లో ముంబయి, చెన్నై జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగడంతో బెట్టింగ్‌లు జోరుగా నడిచాయి.

దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో పెనమలూరు పోలీసులు అత్యంత చాకచక్యంతో దాడులు నిర్వహించడంతో వీరి గుట్టు రట్టయింది. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు సభ్యులున్నారు, ఎక్కడెక్కడ వీరి నెట్‌ వర్క్‌ నడుస్తోందన్న దానిపై ఆరాతీస్తున్నారు.
Crime News
cricket betting team
Krishna District
poranki

More Telugu News