Chandrababu: చంద్రబాబుతో సమావేశమైన ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!

  • రేపు కేబినెట్ సమావేశం
  • ఇంకా గ్రిన్ సిగ్నల్ ఇవ్వని ఈసీ
  • ఈరోజు సాయంత్రానికి క్లారిటీ ఇచ్చే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. రేపు కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ భేటీకి అనుమతి రాకపోవడంతో ఏం చేయాలన్న విషయమై చంద్రబాబు సీఎస్ తో సమాలోచనలు జరిపారు.

దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశం ముగియడంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి బయలుదేరారు. ఈరోజు సాయంత్రానికల్లా మంత్రిమండలి సమావేశంపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు సీఎంకు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈసీ నుంచి అనుమతి వస్తుందా? రాదా? అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.
Chandrababu
ap
Andhra Pradesh
cs
lv subrmanyam

More Telugu News