విద్యారంగం వైపు చిరంజీవి చూపు.. శ్రీకాకుళంలో తొలి ఇంటర్నేషనల్ స్కూల్!
- చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ప్రారంభం
- అత్యాధునిక సౌకర్యాలు, నిపుణులతో విద్యా బోధన
- గౌరవ అధ్యక్షుడిగా హీరో రామ్ చరణ్
అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి క్యాంపస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తామన్నారు. తమ స్కూల్ గౌరవ వ్యవస్థాకుడిగా మెగాస్టార్ చిరంజీవి, గౌరవ అధ్యక్షుడిగా రామ్ చరణ్, గౌరవ చైర్మన్ గా నాగబాబు ఉంటారని తెలిపారు. అలాగే మెగాస్టార్ అభిమానుల పిల్లలకు ఫీజులో ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు.