ఐపీఎల్ ట్రోఫీ ముంబై, చెన్నై జట్ల మధ్యే తిరుగుతోంది!: ధోనీ
- 12 ఐపీఎల్ సీజన్లలో 7 సార్లు గెలిచిన ముంబై, చెన్నై జట్లు
- ఐపీఎల్ లో ముంబై, చెన్నైలు మాత్రమే కనిపిస్తున్నాయి
- తాము ఇంకాస్త బాగా ఆడుండాల్సిందన్న ధోనీ
ఈ 12 సంవత్సరాల్లో 7 సంవత్సరాల పాటు ముంబై, చెన్నై జట్లే కప్పును పంచుకున్నాయి. ఇక నిన్నటి మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీ ముంబై, చెన్నై జట్ల మధ్య అటూ ఇటూ తిరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ లో ముంబై, చెన్నైలు మాత్రమే కనిపిస్తున్నాయని, తమకన్నా ముంబై ఒక్క పరుగు ముందు నిలిచి ట్రోఫీని గెలిచిందని, ఈ ఓటమితో బాధపడకుండా, తదుపరి సీజన్ పై దృష్టిని సారిస్తామని అన్నాడు. ఇంకాస్త బాగా ఆడుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.