స్వతంత్ర భారతావనిలో తొలి టెర్రరిస్ట్ హిందువే!: కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- జాతిపితను హత్య చేసిన గాడ్సే తొలి ఉగ్రవాది
- ప్రజల మధ్య విభేదాలు తెస్తున్న బీజేపీ
- అరవకురిచ్చి ప్రచారంలో కమల్ ఆరోపణలు
'హిందుత్వ తీవ్రవాదం' అన్న పదాన్ని వాడినందుకు తనను ఎంతో మంది విమర్శించారని, ఏ మతమైనా ప్రేమ, అహింసలను మాత్రమే బోధించిందని ఈ సందర్భంగా కమల్ అన్నారు. హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా హింసను ప్రోత్సహించదని, ఖురాన్ ను నమ్మేవారెవరూ ఉగ్రవాదులు కాలేరని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, ప్రజల మధ్య మతపరమైన విభేదాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, అరవకురిచ్చి అసెంబ్లీకి ఈ నెల 19న ఉప ఎన్నికలు జరగనుండగా, కమల్ తన అభ్యర్థిగా మోహన్ రాజ్ అనే వ్యక్తిని నిలిపారు.