అగ్రరాజ్యాలు ఆయుధాల తయారీ నిలిపివేస్తే ఈ ప్రపంచంలో ఉగ్రవాదమే ఉండదు: శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
- ఏ ఉగ్రసంస్థ ఆయుధాలను తయారుచేయడం లేదు
- దేశాలు తయారుచేసిన ఆయుధాలనే ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు
- శాంతి గురించి మాట్లాడుతున్న దేశాల టెక్నాలజీనే మానవ వినాశనానికి తోడ్పడుతోంది
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఆయుధాలను తయారుచేయడం లేదని, పలు దేశాలు తయారు చేస్తున్న ఆయుధాలనే ఆ ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్నాయని అన్నారు.
ప్రపంచంలో ఇవాళ సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాలే శాంతి గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయని, కానీ అదే సమయంలో ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానమే మానవాళి వినాశనానికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు.