ముంబై విజయానికి సూచనలు చేస్తూ ధోని అభిమాని లేఖ.. సోషల్ మీడియాలో వైరల్
- చెన్నైని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ లేఖ
- మొదటి నాలుగు ఓవర్లలోనే కట్టడి చేయాలి
- వాట్సన్, డుప్లెసిస్లను ఔట్ చేయాలి
ఆ లేఖలో ఆటగాళ్లను ఎవరెవరిని తీసుకోవాలో కూడా ఆ అభిమాని సూచించాడు. మొదటి నాలుగు ఓవర్లలోనే చెన్నైని పరుగులు చేయనియ్యకుండా కట్టడి చేయాలని, ఈ నాలుగు ఓవర్లలోనే సాధ్యమైనంత వరకు ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్లను ఔట్ చేయాలని అభిమాని లేఖలో పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ల భాగస్వామ్యం ముంబై విజయానికి కీలకమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.