శాసన సభ ఎన్నికల్లో పోటీ ఖాయం...అప్పటి వరకు సినిమాలే : రజనీకాంత్
- అభిమానులకు స్పష్టమైన సందేశం ఇచ్చిన తలైవా
- 2021 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమని ప్రకటన
- ప్రస్తుతం ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్న రజనీకాంత్
పార్టీ పెట్టడం చిన్న విషయం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని, కానీ 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి కొంత స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నయన తారతో కలిసి ఎ.ఆర్.మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2020 సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంత వరకు తన పార్టీకి పేరు కూడా రజనీకాంత్ ప్రకటించ లేదు. ఈ సినిమా విడుదలైన తర్వాతైనా పార్టీ పేరు ప్రకటిస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.