Chiranjeevi: చిరంజీవి లాంటి నటుడు 'అమ్మడూ కుమ్ముడూ' అనాల్సిన అవసరం లేదు: తమ్మారెడ్డి

  • కెరీర్ పరంగా ఆయన ఎంతో ఎదిగారు
  • చిరంజీవి ఎలాంటి చిత్రం తీసినా చూస్తారు
  • సమాజానికి ఉపయోగపడేలా చేయాలి
చిరంజీవి లాంటి అగ్రశ్రేణి నటుడు ఇవాళ మార్కెట్ కోసం సినిమాలు చేయాల్సిన రేంజ్ దాటిపోయాడని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. చిరంజీవి ఇప్పుడు ఎలాంటి చిత్రం తీసినా చూస్తారని, అలాంటి వ్యక్తి 'అమ్మడూ కుమ్ముడూ' అనాల్సిన అవసరం లేదని, చిరంజీవి తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని సూచించారు. చిరంజీవి కెరీర్ పరంగా ఎంతో ఎదిగిపోయారని, ట్రెండ్ ను ఫాలో అవడం కంటే ఆయన లాంటి వ్యక్తులు ట్రెండ్ సెట్ చేస్తేనే బాగుంటుందని అన్నారు.
Chiranjeevi

More Telugu News