Chiranjeevi: చిరంజీవికి అంతకుమించి ఆలోచించే శక్తి లేదు: తమ్మారెడ్డి భరద్వాజ

  • సినిమాల వరకు చిరంజీవి చాలా కష్టపడతారు
  • తన పరిధి దాటితే ఇతరులపై ఆధారపడతారు
  • రాజకీయాలకు అది సరిపడదని చెప్పాను
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒకప్పుడు సినిమాల్లో నంబర్ వన్ గా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవానికి దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. చిరంజీవి తన సినిమాల వరకు ఎవరూ కష్టపడనంతగా కష్టపడతారని, ఎంత వరకు చేయగలరో అంతా చేస్తారని, కానీ అంతకుమించి ఆలోచించే శక్తి ఆయనకు లేదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.  అందుకే ఆయన ఇతరులపై ఆధారపడతారని, రాజకీయాలకు అది సరిపడదని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమంతట తాము ఆలోచించుకుని రావాలని, ఈ లక్షణం చిరంజీవిలో లేదన్న ఉద్దేశంతోనే తాను గతంలో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని వ్యాఖ్యానించానని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
Chiranjeevi
Tollywood

More Telugu News