West Bengal: వాహనం బోల్తా.. 12 మంది పోలీస్ సిబ్బందికి గాయాలు

  • బరబాచర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఘటనా సమయంలో 21 మంది పోలీసులు
  • సమీప ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
మందు పాతరల నిరోధక వాహనం బోల్తా పడటంతో 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని సింద్రీ ఏరియాలో ఈ ఘటన జరిగింది. మందు పాతరల నిరోధక వాహనంలో పోలీసు సిబ్బంది వెళుతుండగా బరబాచర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే బోల్తా పడింది. ఘటనా సమయంలో వాహనంలో మొత్తం డ్రైవర్ సహా 21 మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. వారిలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
West Bengal
Police
Sindri
Van
Hospital

More Telugu News