Manish Sisodia: గౌతమ్ గంభీర్‌కి డూప్.. ఆధారాలతో 'ఆప్' ఆరోపణలు!

  • అచ్చం తనలా ఉండే వ్యక్తితో ప్రచారం
  • ఫోటోను షేర్ చేసిన సిసోడియా
  • కారులో కూర్చొని ఉన్న గంభీర్
ఎన్నికలకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ, తూర్పు బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణ చేసింది. గంభీర్ ఎండ వేడిమిని తట్టుకోలేక అచ్చం తనలా ఉండే మరో వ్యక్తి చేత ప్రచారం చేయిస్తున్నారని ఆప్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.

దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో గంభీర్ కారులో కూర్చొని ఉండగా, నల్లటి టోపి ధరించిన మరో వ్యక్తి ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. ‘గౌతమ్ ఎండలో.. గంభీర్ ఏసీలో’ అని ఈ సందర్భంగా సిసోడియా వెటకారంగా ట్వీట్ చేశారు.            

Manish Sisodia
Gowtham Gambhir
AAP
Twitter
Social Media

More Telugu News