yeddyurappa: 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు.. ఏమైనా జరగొచ్చు: యడ్యూరప్ప

  • ఏ క్షణంలోనైనా వీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు
  • ఏం జరగబోతుందో వేచి చూడాలి
  • బాంబు పేల్చిన యడ్యూరప్ప
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో బాంబు పేల్చారు. ప్రస్తుత ప్రభుత్వం పట్ల 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరని ఆయన అన్నారు. వీరంతా ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఏం జరగబోతోందో వేచి చూడాలంటూ ఉత్కంఠను మరింత పెంచారు. మరోవైపు, కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఎన్నో ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, యడ్యూరప్ప చెప్పినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదైనా ఊహించని నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం... ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.
yeddyurappa
bjp
karnataka
congress
mla

More Telugu News