మణికొండలో ఆడుకుంటూ.. కాలువలో పడి ఐదేళ్ల బాలుడి మృతి

  • తోటి పిల్లలతో ఆడుకుంటూ పడిపోయిన బాలుడు
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • మృతదేహం వెలికితీత
హైదరాబాద్‌ శివారు మణికొండలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ సమీపంలోని కాలువలో పడిపోవడంతో మృత్యువుపాలయ్యాడు. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గండిపేట నుంచి షేక్‌పేట వాటర్‌ ఫిల్టర్‌కు నీరందించే కాలువ మణికొండ ప్రాంతం మీదుగా వెళ్తుంది.

ఈ కాలువ పక్కన స్థానిక నివాసితుల పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో ఆనంద్‌ అనే పిల్లాడు ఆట సరదాలో పడి అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  వారు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో కాలువలో గల్లంతైన బాలుడి కోసం వెతికారు. కాసేపటికి బాలుడి మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు గొల్లుమన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
manikonda
5 years boy died
water canal

More Telugu News