అందుకే రాజమౌళికి 'జక్కన్న' అనే పేరు పెట్టాను: రాజీవ్ కనకాల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే రాజమౌళికి 'జక్కన్న' అనే పేరు పెట్టాను: రాజీవ్ కనకాల

  • ఒకేసారి నాలుగు డైలీ సీరియల్స్ లో చేస్తున్నాను
  •  'శాంతినివాసం' ఫస్టు డే షూటింగుకి వెళ్లాను
  • రాజమౌళి స్టయిల్ అప్పుడు చూశాను
తాజా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ, రాజమౌళి గురించి ప్రస్తావించాడు. "రాజమౌళి 'శాంతినివాసం' సీరియల్ ను మొదలుపెట్టినప్పటికే, నేను నాలుగు డైలీ సీరియల్స్ లో నటిస్తున్నాను. అప్పటికే బుల్లితెర నటుడిగా నాకు మంచి క్రేజ్ వుంది. 'శాంతినివాసం' సీరియల్లో నా పాత్రకి సంబంధించిన షూటింగు ఆరోజు. లొకేషన్ కి వెళ్లి సీన్ ఏంటి? అని అడిగితే, ఓ మూడు పేజీలు ఉంటుందని చెప్పారు. ఓస్ అంతేకదా పేజీలకి పేజీల సీన్స్ చేసేసిన వాళ్లం ఇదో లెక్కా? అనుకున్నాను.

15 పేజీల సీన్లనే అరగంటలో చేసేసిన రోజులున్నాయి. అందువలన నేను అలా అనుకున్నాను. కానీ ఆ రోజున ఆయన నాకు సంబంధించిన సీన్స్ ను రాత్రి 12 .. 1గంట వరకూ తీశారు. అప్పుడు అనుకున్నాను.. ఏమిట్రా బాబు ఈయన 'జక్కన్న' మాదిరిగా చెక్కుతున్నాడు అని. అప్పటి నుంచి ఆయనతో చనువుగా వుండేవాళ్లు 'జక్కన్న' అని పిలవడం మొదలైంది. 'శాంతినివాసం'లో నా పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చాడు. 
rajeev kanakala
rajampouli

More Telugu News