pm: ఇంత భయస్థుడైన ప్రధానిని నేనెక్కడా చూడలేదు:మోదీపై ప్రియాంక విమర్శలు

  • ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మరిచారు
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చారు
  • మేము అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం తెస్తాం
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నసింగ్ కు మద్దతుగా ఈరోజు నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, మోదీ వంటి భయస్థుడు, బలహీనమైన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మరిచారని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని, న్యాయ్ పథకం తీసుకొచ్చి పేదలకు ప్రయోజనం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు.
pm
modi
congress
priyanka
Uttar Pradesh

More Telugu News