Vijay Sai Reddy: శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడ్నే బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్: విజయసాయిరెడ్డి

  • సమాజాన్ని భ్రష్టుపట్టించాడు
  • బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు
  • ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కూడా మామూళ్లు వసూలుచేశారు
టీవీ9 చానల్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న రవిప్రకాశ్ పై ఫోర్జరీ ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు నోటీసులు కూడా అందినట్టు సమాచారం. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. మెరుగైన సమాజం కోసం అంటూ రవిప్రకాశ్ అనేక విధాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. ఇప్పుడు రవిప్రకాశ్ గుట్టురట్టు కావడంతో అతడి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని విజయసాయి ట్వీట్ చేశారు.

కొన్నాళ్ల క్రితం శ్రీనిరాజు తోడల్లుడు సత్యం రామలింగరాజు విషయంలో రవిప్రకాశ్ దారుణంగా వ్యవహరించాడంటూ విమర్శించారు. శ్రీనిరాజు టీవీ9 వ్యవస్థాపకుల్లో ఒకరన్న సంగతి తెలిసిందే. సత్యం వ్యవహారంలో బెయిల్ రావడంతో రామలింగరాజు చికిత్స కోసం నిమ్స్ లో చేరితే, అక్కడాయన సెల్ ఫోన్ లో మాట్లాడుతుండగా రవిప్రకాశ్ స్పైక్యామ్ తో రికార్డ్ చేయించి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు వసూలు చేశాడని విజయసాయి ఆరోపించారు. చివరికి ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కూడా తన మనుషులతో నెలవారీ మామూళ్లు వసూలుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయని, వాటిపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Vijay Sai Reddy

More Telugu News