తనకు వ్యతిరేకంగా పంచిపెట్టిన కరపత్రాలను చదువుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ఆప్ అభ్యర్థి
- గంభీర్ పై ఆరోపణలు
- అతిషికి ఆప్ నేతల సంఘీభావం
- ఆమ్ ఆద్మీ నేతలకు బదులిచ్చిన గంభీర్
గంభీర్ లాంటి వ్యక్తి ఎంపీగా వస్తే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కరపత్రమే చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తీవ్రస్థాయిలో స్పందించారు. గంభీర్ ఈ స్థాయికి దిగజారతారని తాము ఊహించలేకపోతున్నామని అన్నారు. దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యతిరేక శక్తులను అతిషి ధైర్యంగా ఎదుర్కోవాలంటూ పిలుపునిచ్చారు. ఆ వెంటనే గంభీర్ ఘాటుగా బదులిచ్చారు.
ఎన్నికల్లో గెలిచేందుకు ఏ మార్గం దొరక్క ఓ మహిళ కన్నీటిపై ఆధారపడుతున్నారంటూ కేజ్రీవాల్ పై విమర్శ చేశారు. అయితే, ఆ కరపత్రాలు పంచింది తాను కాదని, తానే ఆ కరపత్రాలు పంచినట్టు రుజువు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని గంభీర్ స్పష్టం చేశారు.