చంద్రబాబూ.. లోకేశ్ ఎమ్మెల్సీ సీటును కిడారికి ఎందుకు ఇవ్వలేకపోయావ్?: విజయసాయిరెడ్డి
- కిడారి కుటుంబాన్ని బాబు ఆదుకుంటామన్నారు
- నక్క జిత్తుల రాజకీయాలపై పేటెంట్ బాబు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
‘నక్క జిత్తుల రాజకీయాలకు మరో వందేళ్ల పేటెంటు మీదే చంద్రబాబూ. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్ హతమారిస్తే, కొడుకు శ్రావణ్ ను మంత్రిని చేశావు. 6 నెలల గడువు ముగిసింది. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్ కు ఎందుకివ్వలేక పోయావ్?’ అని విమర్శలు గుప్పించారు. కిడారి శ్రావణ్ పదవీకాలం రేపటితో పూర్తికానుంది. దీంతో ఈరోజు రాజీనామా చేసేందుకు ఆయన అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు.