చంద్రబాబు ఏకంగా గవర్నర్ పైనే ఒత్తిడి తెస్తున్నారు.. ఇది దారుణం!: విజయసాయిరెడ్డి
- సమాచార కమిషనర్ల నియామకంపై వ్యాఖ్య
- ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు నియమిస్తామంటున్నారు
- గవర్నర్ కొత్త ప్రభుత్వానికి ఆ ఛాన్స్ ఇవ్వాలి
ఐదేళ్లు నిద్రపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి నిమిషంలో సమాచార కమిషనర్ల నియామకాలు జరపడం అనైతికతకు పరాకాష్ట అని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ ఈ నియామకాలను ఆమోదించరాదని కోరారు. కొత్త ప్రభుత్వానికి సమాచార కమిషనర్లను నియమించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.