ఆ చిన్నారి బాలికను కాపాడేందుకు ఇప్పటికే రూ.4 కోట్లకు పైగా విరాళాలు అందించిన దాతలు!
- సన్నీవాలాకు చెందిన ధృతి నారాయణ్
- కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన ధృతి
- పాదచారులపైకి కారుతో దూసుకెళ్లిన వ్యక్తి
- తీవ్రంగా గాయపడిన బాలిక
ధృతి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు గోఫండ్మీ అనే సంస్థను ఆశ్రయించారు. దీంతో ఆ సంస్థ ధృతి పేరుపై ఓ పేజీని రూపొందించి విరాళాలు సేకరించడం ప్రారంభించింది. ధృతి పరిస్థితిని తెలుసుకున్న అనేకులు వారం రోజుల్లోనే 6 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 4కోట్లకు పైగా విరాళాలు అందించారు. ఈ ఘటనను పోలీసులు జాతి విద్వేష దాడిగా ధ్రువీకరించారు. గతంలో ఇరాక్ సైన్యంలో పనిచేసిన ఇసాయ్ ముస్లింలపై ద్వేషం పెంచుకున్నాడు. ఘటన సమయంలో అక్కడి వారంతా ముస్లింలుగా భావించి ఉద్దేశపూర్వకంగా కారుతో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.